ముంబైలో తెలుగు అమీనా మృతి
నిజామాబాద్: ఉగ్రవాదుల దాడుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరో వ్యక్తి మరణించినట్లు సమాచారం అందింది. నిజామాబాద్ లోని శాంతినగర్ కు చెందిన అమీనాబీ అనే మహిళ ముంబయిలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించినట్లు తెలిసింది. ఈ దాడుల్లో అమీనాబీ తండ్రి అబ్దుల్ రషీద్ గాయపడ్డాడు.
ముంబయిలో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో ఇద్దరు హైదరాబాదీలు మరణించినట్లు ఇప్పటికే సమాచారం అందింది. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన లక్ష్మీనారాయణ గోయల వ్యక్తిగత పనుల మీద ముంబయి వెళ్లి తిరిగి వస్తుండగా అతను ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. కాగా, విజయరావు బాంజే నగరం తాజ్ హోటల్లో చీఫ్ చెఫ్ గా పని చేస్తున్నాడు. ఇతను ఉగ్రవాదుల దాడిలో మరణించాడు.












Click it and Unblock the Notifications
