తాజ్ హోటల్లో 30 మృతదేహాలు
ముంబయి: తాజ్ హోటల్ నుంచి 30 మృత దేహాలను మెరైన్ కమెండోలు స్వాధీనం చేసుకున్నారు. హటల్లోని ఒక గదిలో ఉగ్రవాదులు 200 మందిని బంధించారు. ఉగ్రవాదులకు తాజ్ లే అవుట్ మొత్తం తెలుసునని, వారి వద్ద ఎకె సిరీస్ రైఫిళ్లున్నాయని వారు చెప్పారు. 1200 డాలర్లు, 6 వేల రూపాయలను మెరైన్ కమెండోలు స్వాధీనం చేసుకున్నారు.
మెరైన్ కమెండోల చేతికి ఒక మార్షియస్ నేషనల్ ఐడెంటిటీ లభించింది. పలు క్రెడిట్ కార్డులు కూడా లభించాయి. తాజ్ హోటల్లో అంతకు ముందు తాజాగా ఉగ్రవాదులకు, జాతీయ భద్రతా దళాల కమెండోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. లోపలి నుంచి ఒక పేలుడు శబ్దం కూడా వినిపించింది. తాజ్ హోటల్లో ఒక మిలిటెంట్ కమెండోలను ఎదిరిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ కమాండర్ చెప్పారు.












Click it and Unblock the Notifications
