పొత్తులకు మేం సిద్ధమే: చిరు

Chiranjeevi
హైదరాబాద్: ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని, తమ తలుపులు తెరిచే ఉన్నాయని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రకటించారు. తాము పసివాళ్లమని, చిన్నవాళ్లమని కొందరు దూరంగా పెడుతున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమకు ప్రజా బలముందని, ఎవరొచ్చినా రాకున్నా ప్రజలకు సేవ చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తామని అన్నారు. పొత్తులపై తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో చేదు అనుభవం ఎదురైనా అది పథకం ప్రకారం జరిగింది కాదని వ్యాఖ్యానించారు. తాము ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలనే భావనతో లేమని స్పష్టం చేశారు.

ముంబయి పేలుళ్ల ఘటనలు దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 'మనం ఎక్కడున్నామని, జనసామాన్యం ఎలా బతకాలని ఆయన అడిగారు. అందరిలో అభద్రతా భావం అలుముకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్‌, కర్ణాటక, ఢిల్లీ, గౌహతి, గుజరాత్‌ తదితర ప్రాంతాల్లో గతంలో దాడులు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది నిఘా వైఫల్యమేనని, ఉగ్రవాదుల్ని అరికట్టేస్థాయిలో మన నిఘా వ్యవస్థ లేకపోవటమే సమస్యగా మారిందని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+