టెర్రర్ కాల్పుల్లో మేజర్ మృతి
ముంబయి: తాజ్ హోటల్ పాత భవనంలో ఇంకా ఉగ్రవాదులు దాగి సైన్యంపై కాల్పులు జరుపుతున్నారు. వీరి అదుపులో ఓ మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఉగ్రవాదుల దాడిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, తాజ్‌లో చీఫ్ చెఫ్ పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన విజయ్‌రావు బాంజాలు మృతి చెందారు.
కొత్త భవనం మాత్రం పూర్తిగా విముక్తమైందని, తనిఖీల నిమిత్తం పోలీసులకు అప్పగించామని సైన్యం తెలిపింది. తాజ్ నుంచి తాజాగా పలు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. తాజ్ పాత హెరిటేజ్ భవనంలో ఒక ఉగ్రవాది మాత్రమే ఉన్నాడని భావిస్తున్నారు. అతను ఒక అంతస్థు నుంచి మరో అంతస్థుకు చేరుకుంటూ కమెండోలపైకి కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులపైకి కూడా కాల్పులు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications
