10కె రన్: టీ షర్టులో వైయస్
హైదరాబాద్ : నగరంలో జరిగిన 10కె రన్ కార్యక్రమంలో వేలాదిమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరుగును ప్రారంభించారు. శాసనసభాపతి సురేష్‌రెడ్డితో పాటు పలువురు నటులు, విద్యార్థులు తదితరులు ఈ పరుగులో పాల్గొన్నారు. పరుగును ప్రారంభించడానికి ముందు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖ రెడ్డి ముంబయి దాడుల మృతులకు సంతాపం ప్రకటించారు.
ముఖ్యమంత్రి తన సంప్రదాయ వస్త్రధారణకు భిన్నంగా టీ షర్ట్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం పలువురిని ఆకర్షించింది. ప్రైజ్ మనీ కోసం కాకుండా జాతి శ్రేయస్సు కోసం ఈ పరుగులో పాల్గొనడం సంతృప్తికరంగా ఉందని పలువురు అన్నారు. ఈ పరుగు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు నుంచి ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications
