దేశ్ ముఖ్ వారసుడు చౌహాన్?
ముంబయి: ముంబయి దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో పృథ్వీరాజ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా నియమితులు కానున్నట్లు సమాచారం. పృథ్వీరాజ్ చౌహాన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో విలాస్ రావు తీరుపై కూడా విమర్శలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దేశ్ ముఖ్ రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో విలాస్ రావు దేశ్ ముఖ్ ముంబయిలో లేకపోవడం, వెంటనే తగిన చర్యలు చేపట్టలేకపోవడం వంటి లోపాలు జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే, ముంబయి పేలుళ్లకు నైతిక బాధ్యత వహించి తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఉప ముఖ్యమంత్రి ఆర్ఆర్ పాటిల్ తేల్చి చెప్పారు. ముంబయి దాడులను చాలా చిన్నవిగా ఆయన శనివారంనాడు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
