తెలంగాణపై చర్చించలేదు: డిఎస్
హైదరాబాద్: తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమొయిలీతో తెలంగాణపై చర్చించలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. తాజా రాజకీయాలపై మాత్రమే తాము చర్చించినట్లు ఆయన తెలిపారు. పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి మనవరాలి పెళ్లికి వచ్చిన వీరప్ప మొయిలీని శ్రీనివాస్ ఆదివారంనాడు కలుసుకున్నారు. తాను మర్యాదపూర్వకంగా మాత్రమే మొయిలీని కలుసున్నట్లు శ్రీనివాస్ చెప్పారు.
తాము ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు. రోడ్ షోల నిర్వహణ కాంగ్రెస్ విధానం కాదని ఆయన చెప్పారు. వీరప్ప మొయిలీని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కూడా కలుసుకున్నారు. ఇతర ముఖ్య నేతలు కూడా ఆయనను కలుసుకున్నారు. వారు వీరప్పమొయిలీతో ఏం మాట్లాడారనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications
