పాటిల్ రాజీనామా మంచిది: మొయిలీ
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ రాజీనామా చాలా మంచిదని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి మనవరాలి పెళ్లికి వచ్చిన ఆయన ఆదివారం మీడియా ప్రతినిదులతో మాట్లాడారు. శివరాజ్ పాటిల్ రాజీనామా ద్వారా తమ ప్రభుత్వం చిత్తుశుద్ధిని నిరూపించుకుందని, కాంగ్రెసు పార్టీకి ఆ సంప్రదాయం ఉందని ఆయన అన్నారు. పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు హోం మంత్రిగా ఉన్న బిజెపి నాయకుడు ఎల్ కె అద్వానీ రాజీనామా చేయకపోవడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ముంబయి దాడుల ప్రభావం ఎన్నికలపై ఉండదని ఆయన అన్నారు. రాష్ట్రంలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిసెంబరులో రాష్ట్రంలో పర్యటిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
