భద్రతా సలహాదారు నారాయణన్ రాజీనామా
న్యూఢిల్లీ: ముంబయి ఉగ్రవాద దాడులకు బాధ్యత వహిస్తూ జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం తన రాజీనామా లేఖను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు పంపారు. ముంబయి దాడుల నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదించారు.
ఈ స్థితిలో నారాయణన్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ స్థితిలో ముంబయి దాడులు కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. దీంతో నారాయణన్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించారా, లేదా అనేది తెలియదు.












Click it and Unblock the Notifications
