హోం మంత్రి పాటిల్ రాజీనామా
న్యూఢిల్లీ : కేంద్రహోంశాఖ మంత్రి శివరాజ్‌పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. ముంబయి నగరంపై ఉగ్రవాదుల దాడులకు నైతికబాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. పాటిల్ హయాంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో ఆయన పదవినుంచి తప్పుకోవాలని ప్రధాన ప్రతిపక్షం భారతీయజనతాపార్టీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ అధినేత్రి సోనియా ఆశీస్సులతో ఆయన పదవికి ఎలాంటి గండం ఏర్పడలేదు. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఉగ్రవాద దాడులపై పాటిల్‌ను ప్రశ్నించడంతో ఆయన రాజీనామా చేసినట్టు తెలిసింది.
శనివారం రాత్రి జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లో తీవ్ర చర్చ జరిగింది. దీంతో శివారాజ్ పాటిల్ రాజీనామా చేయక తప్పలేదు. శివరాజ్ పాటిల్ రాజీనామా చేసిన విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. ఆయన రాజీనామాను ప్రధాని మోదించినట్లు కూడా తెలుస్తోంది. ఆయన స్థానంలో ఆర్థిక మంత్రి పి. చిదంబరం కేంద్ర హోంశాఖను చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications
