నారాయణన్ రాజీనామా అబద్ధం: పిఎంఒ
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్ రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను ప్రధాని కార్యాలయం (పిఎంఒ) ఖండించింది. నారాయణన్ రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని పిఎంఒ ఆదివారం సాయంత్రం స్పష్టం చేసింది. ముంబయి ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో నారాయణన్ తన పదవికి రాజీనామా చేసినట్లు, తన రాజీనామా లేఖను ఆయన ప్రధానికి పంపినట్లు ఒక టీవీ చానెల్ వార్తను ప్రసారం చేసింది.
నారాయణన్ రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చిన వెంటనే పిఎంఒ స్పందించింది. ముంబయి ఉగ్రవాదుల దాడుల విషయంలో నిఘా వైఫల్యంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నారాయణన్ రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications
