ముప్పుపై ముందే హెచ్చరికలు: టాటా
న్యూఢిల్లీ: తాజ్ మహల్ ప్యాలెస్ కు, టవర్ హోటల్ కు ఉగ్రవాదుల ముప్పు ఉందని ముందే హెచ్చరించారని, తాత్కాలికంగా భద్రతను పెంచారని, అయితే ఉగ్రవాదులు దాడి చేయడానికి అవేవీ అడ్డు రాలేదని టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా అన్నారు. ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా అన్నారు. తమకు అటువంటి హెచ్చరికలు అందినప్పుడు భద్రతా చర్యలు తీసుకోలేక పోవడం విచారకరమని ఆయన అన్నారు. హెచ్చరికల సారాంశాన్ని ఆయన వివరించలేదు. భద్రతకు సంబందించిన చర్యలు చేపట్టినా ఆపలేకపోయి ఉండేవారమేమో అని ఆయన అన్నారు.
తాము దాడి చేస్తున్నట్లు వారికి తెలుసునని, అందువల్ల ప్రధాన ద్వారం నుంచి రాలేదని, భద్రతా చర్యలన్నీ ప్రధాన ద్వారం వద్దనే ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతిదీ వారు ప్రణాళికా బద్దంగా చేసుకున్నారని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయలు సరిగా లేవని ఆయన అన్నారు. ముంబయి ప్రజలను ఆయన అభినందించారు. ముంబయి ప్రజలు కలిసికట్టుగా ఉంటారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాజ్ హోటల్ ను తిరిగి నిర్మించాలని సిబ్బంది కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
