అసెంబ్లీకి కిషన్ రెడ్డి పాదయాత్ర
హైదరాబాద్: ముంబయిలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండకు నిరసనగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని అణచివేయాలని, ఓటుబ్యాంకు రాజకీయాలను విడనాడాలని వారు నినాదాలు చేశారు. అసెంబ్లీ వద్ద పోలీసులు వారిని అడ్డుకుని వెనుకకు పంపారు. ప్రభుత్వం ఉగ్రవాడాన్ని అణచివేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు.
యుపిఎ ప్రభుత్వం వల్లనే దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. యుపిఎది వెన్నెముక లేని ప్రభుత్వమని ఆయన అన్నారు. అధికారంలోకి రాగానే పొటాను రద్దు చేసి ఉగ్రవాదులకు ప్రోత్సాన్నిచ్చిందని ఆయన అన్నారు. ఓట్ల కోసం ప్రభుత్వం తమ వారిని బలి పెడుతోందని పోలీసు, సైనిక కుటుంబాల్లో బాధ ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
