ఆర్ఆర్ పాటిల్ రాజీనామా
ముంబయి: ముంబయి ఉగ్రవాద దాడులు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాను రాజీనామా చేసేది లేదని మొరాయించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ సోమవారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ కు అందజేశారు. ముంబయి దాడులకు నైతిక బాధ్యత వహించి తాను రాజీనామా చేసినట్లు పాటిల్ తెలిపారు. తన ఆత్మప్రబోధం మేరకే రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. ఆర్ ఆర్ పాటిల్ రాజీనామాతో ముఖ్యమంత్రి విలాసరావు దేశ్ ముఖ్ పై ఒత్తిడి పెరుగుతోంది.
ఆదివారంనాడు పాటిల్ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ ను కలిశారు. తాను రాజీనామా చేసేది లేదని ఈ భేటీ అనంతరం ఆయన చెప్పారు. అక్షరధామ్ పై దాడి జరిగినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్ కె అద్వానీ రాజీనామా చేయలేదని ఆయన గుర్తు చేస్తూ తాను మాత్రమే ఎందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన అడిగారు. అంతేకాదు, ముంబయి ఉగ్రవాద దాడులను ఆయన చాలా చిన్న సంఘటన పేర్కొని విమర్శలకు గురయ్యారు.












Click it and Unblock the Notifications
