గిరిజనులను చంపిన నక్సల్స్
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు గిరిజనులను కాల్చి చంపారు. చింతపల్లి ఏజెన్సీలోని మేడూరులో ఈ సంఘటన జరిగింది. వీరు పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, గతంలో పలుమార్లు హెచ్చరించినా వినకపోవటంతో కాల్చి చంపామని నక్సల్స్ ఓ లేఖలో తెలిపారు. రెండు మోటారుసైకిళ్లను కూడా నక్సల్స్ దగ్ధం చేశారు. ఇటీవలి కాలంలో ఇన్ ఫార్మర్ల పేరుతో గిరిజనులను నక్సల్స్ కాల్చి చంపడం ఇది రెండోసారి.












Click it and Unblock the Notifications
