హైదరాబాదుకు సుష్మ మృతదేహం
హైదరాబాద్ :అమెరికాలో అనుమానస్పద పరిస్థితుల్లో మరణించిన సుష్మ మృతదేహం ఆదివారం హైదరాబాద్ నగరానికి చేరుకుంది. ముంబయినుంచి ఇండియన్ ఎయిర్‌లైన్ విమానంలో ఆమె మృతదేహాన్ని తీసుకువచ్చారు. తమ కుమార్తె మరణానికి ఆమె భర్త సురేష్‌బాబే కారణమని సుష్మతండ్రి కనకరాజు ఆరోపించారు. అమెరికాలో ఇటీవల సుష్మ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.
సుష్మ మృతి ఎలా జరిగినా కారకుడు మాత్రం తన అల్లుడు సురేషేనని ఆయన అన్నారు. మృతి కారణాలు దర్యాప్తు నివేదిక వస్తే కానీ తెలియదని ఆయన అన్నారు. సుష్మ మృతదేహం ఆదివారంనాడు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది.












Click it and Unblock the Notifications
