5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. లోకసభ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ శాసనసభల ఎన్నికల ఫలితాలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విజయం ఎవరిని వరిస్తుందనేది స్పష్టమయ్యే అవకాశాలున్నాయి. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడి కాగలవని భావిస్తున్నారు.
నక్సల్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశలుగా, నవంబర్ 14, 20తేదీల్లో పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 27, ఢిల్లీ నవంబర్ 29, మిజోరంలో డిసెంబర్ 2, రాజస్థాన్‌లో డిసెంబర్ 4న పోలింగ్ జరిగింది. ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన పత్యర్థులు కాంగ్రెస్, బిజెపిలే. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్), కాంగ్రెస్, యునైటెడ్ డెమోక్రటిక్ అలయెన్స్(యూడీఏ) తలపడ్డాయి.












Click it and Unblock the Notifications
