కాంగ్రెస్ కు ముద్దుకృష్ణమ రాజీనామా
హైదరాబాద్: చిత్తూరు జిల్లా పుత్తూరు శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు తన శాసనసభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. కాంగ్రెసు పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తూ తన లేఖను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శీనివాస్ కు అందజేశారు. అలాగే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన లేఖను స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డికి సమర్పించారు.
ఆయన ఈ నెల 12వ తేదీ సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరునున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెసులోకి వెళ్లారు. ఆయనకు కాంగ్రెసులో మంత్రి ఆర్. చెంగారెడ్డితో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఇరువురు బహిరంగ విమర్శలకు కూడా దిగారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి చెంగారెడ్డి తనను అణచివేస్తున్నారని గాలి ముద్దు కృష్ణమనాయుడు చాలా కాలంగా ఆవేదనతో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో పుత్తూరు నియోజకవర్గం రద్దయింది. దీనికి కూడా ఆ ముగ్గురే కారణమని ఆయన భావిస్తున్నారు. పైగా సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం కూడా ఆయనను కలత పెట్టినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
