ఏప్రిల్, మే నెలల్లో లోకసభ ఎన్నికలు
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లోకసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎన్. గోపాలస్వామి సోమవారం చెప్పారు. అత్యంత అవసరమైతే తప్ప లోకసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. నిజానికి, ప్రభుత్వ కాలవ్యవధి ముగియడానికి కొంచెం ముందుగా ఎన్నికలు నిర్వహించడం సంప్రదాయమని ఆయన అన్నారు.
సాధారణమైన రీతిలోనే లోకసభ ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లోనే కచ్చితంగా ఎన్నికలు జరుగుతాయా అని ప్రశ్నిస్తే ముందస్తుగా నిర్వహించడానికైనా తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
