తెలంగాణ బంద్ వాయిదా
హైదరాబాద్: ఈ నెల 12న తలపెట్టిన తెలంగాణ బంద్‌ను వాయిదా వేశారు. తెలంగాణ యూనివర్సిటీస్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ బంద్ జరగనుంది. అయితే నిర్వహణకు తక్కువ సమయం, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ యూని వర్సిటీస్ టీచర్స్ ఫోరం ప్రతినిధులు తెలిపారు. తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ఇతర ప్రజా సంఘాల సహకారంతో నిర్వహించతలపెట్టిన బంద్ ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications