బెయిల్ అవుట్ ప్యాకేజీ విఫలం
న్యూయార్క్: నష్టాల్లో ఉన్న అమెరికా ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన బెయిల్ అవుట్ ప్యాకేజి విఫలమైంది. ఈ బిల్లును గత రాత్రి ప్రభుత్వం సెనేట్‌లో ప్రవేశపెట్టగా చర్చ అనంతరం ఓటింగ్ జరిగింది. ఇందులో బిల్లు మెజార్టీ సభ్యుల ఆమోదాన్ని పొందలేకపోయింది. తీవ్ర నష్టాల్లో కూరుకునిపోయిన జనరల్ మోటార్స్, క్రిస్లర్స్, ఫోర్డ్ కంపెనీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ ప్యాకేజిని ప్రతిపాదించింది. డెమొక్రాటిక్, రిపబ్లికన్ ప్రతినిధుల మధ్య ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.
ఆటోమొబైల్ బెయిల్ అవుట్ ప్యాకేజీ విఫలమైందని తెలియగానే శుక్రవారం జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాల్లో స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ఆటో మొబైల్ రంగానికి 14 మిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది. వేతనాల్లో కోత విధించుకోవడానికి యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్ తిరస్కరించడంతో ఈ ప్యాకేజీ సెనేట్ ఆమోదం పొందలేకపోయింది.












Click it and Unblock the Notifications