బ్యాంక్ అఫ్ అమెరికాలో వేల ఉద్వాసనలు
న్యూయార్క్: అమెరికాలో ముదురుతున్న ఆర్థిక మాంద్యం సెగలు తాజాగా బ్యాంక్ ఆఫ్ అమెరికాను కూడా తాకాయి. వచ్చే మూడేళ్లలో తాము 30నుంచి 35 వేలమంది వరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆ బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం మెరిన్ లించ్ బ్యాంకు టేకోవర్ ప్రక్రియ కొనసాగుతోందని అది పూర్తయిన తరువాత అంచెలవారిగా మూడేళ్లలో ఈ తొలగింపు ఉంటుందని తెలిపారు. జనవరిలో విలీనం ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో ఈ బ్యాంకు అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. ఉద్యోగుల తొలగింపులో తాము ఉదారంగానే వ్యవహరిస్తున్నామని, 75 వేలమందిని తొలగిస్తున్న సిటీబ్యాంకు గ్రూప్ కంటే తామే మెరుగని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంటోంది.
ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగుల సంఖ్య అంత కన్నా ఎక్కువ ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెహిల్ 3,08,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ఈ ఉద్వాసన రెండు కంపెనీల ఉద్యోగులపై, వాణిజ్యంపై పడుతుంది. బ్యాంక్ అఫ్ అమెరికా దేశంలోని అత్యంత ఆరోగ్యకరమైన సంస్థగా పేరు పొందింది. దీనిలో పరిస్థితి ఇలా ఉంటే దేశంలోని మిగతా సంస్థల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఒక నవంబర్ నెలలోనే అమెరికాలో ఐదు లక్షల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications