కత్తిపోట్ల వల్లే భార్గవి మృతి: పోస్టుమార్టం

భార్గవి మృతదేహాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. సంఘటనా స్థలంలో పోలీసులకు ఒక కత్తి లభించిన విషయం తెలిసిందే. ప్రవీణ్ కుమార్ అలియాస్ బుజ్జి ఆమెను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ ఇంత పని చేస్తాడని అనుకోలేదని భార్గవి తల్లిదండ్రులు అన్నారు. టీవీల్లో చూసే వరకు తమ కూతురి మరణవార్త తెలియదని వారన్నారు. ప్రవీణ్ కుమార్ తో పెళ్లయినట్లు తమకు తెలియదని వారన్నారు. ప్రవీణ్ కుమార్ సూసైడ్ నోటులోని విషయాలన్నీ అబద్ధాలని భార్గవి తండ్రి ప్రసాదరావు అన్నారు. భార్గవి సంపాదన మీద ఆధారపడాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications