ప్రధాని చేతిలో అంతూలే రాజీనామా

అంతూలే తన రాజీనామా లేఖను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపినట్లు సమచారాం. బుధవారం రాత్రే ఆయన తన రాజీనామా లేఖను ప్రధానికి పంపినట్లు తెలుస్తోంది. తాను రాజీనామా చేసినట్లు వార్తలను తాను ధ్రువీకరంచనూ లేను, ఖండించనూ లేనని అంతూలే మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను ఎవరికీ వివరణ ఇవ్వబోనని ఆయన గురువారం చెప్పిన విషయం తెలిసిందే. తాను సోనియాకు గానీ, ప్రధానికి గానీ వివరణ ఇవ్వలేదని ఆయన చెప్పారు. అంతూలేను మంత్రివర్గం నుంచి తొలగించాలని బిజెపి డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications