కొత్త సిఎస్ గా ఎస్ వి ప్రసాద్?
హైదరాబాద్: తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి స్ధానంలో భూపరిపాలన చీఫ్ కమిషనర్ ఎస్ వి ప్రసాద్ నియమితులయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ప్రసాద్ ను ఈ ప్రతిష్టాత్మక పదవిలో నియమించాలంటే చాలా మంది సీనియర్ ఐఎఎస్ అధికారులను పక్కన పెట్టవలసి ఉంటుంది. న్యాయపరమైన లిటిగేషన్లు రాకుండా ప్రసాద్ ను ఇన్ చార్జి చీఫ్ సెక్రటరీగా నియమించవచ్చు. ఈ మేరకు ఉత్తర్వులు క్రిస్టమస్ తర్వాత వెలువడే అవకాశాలున్నాయి.
ఎస్ వి ప్రసాద్ కు గతంలో ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన తొమ్మిదేళ్ళ పాటు ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. ఆయనకు వివాద రహితుడిగా, సౌమ్యుడిగా పేరుంది.












Click it and Unblock the Notifications