వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హస్తం గుర్తుపై నాదెండ్ల కథనం

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: కాంగ్రెస్‌(ఐ) పార్టీ తన ఎన్నికల చిహ్నంగా 'హస్తం' ఎంచుకోవడంపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తన ఆత్మకథలో ఆసక్తికర సమాచారాన్ని వెల్లడించారు. కంచి శంకరాచార్య సూచన మేరకే పార్టీ ఈ గుర్తును ఎంచుకున్నట్లు అందులో పేర్కొన్నారు. గతంలో ఓసారి మదనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇందిరాగాంధీతోపాటు తాను శంకరాచార్యను కలిశామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా.. తన నేతృత్వంలో కొత్తగా ఆవిర్భవించిన కాంగ్రెస్‌(ఐ)కి ఎన్నికల గుర్తు సూచించాల్సిందిగా ఇందిరాగాంధీ శంకరాచార్యను కోరారు. అందుకు ఆయన 'హస్తం' సరైందన్నట్లుగా తన చేయిని గాలిలోకి వూపారు. ఆ క్షణానే ఇందిర తన పార్టీకి హస్తం గుర్తును ఖరారు చేసినట్లు భాస్కరరావు వివరించారు. ఈ విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదని పుస్తకంలో పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X