గ్లామర్ కి ఓట్లు రాలవు:బాబు

కొత్త పార్టీ నాయకుడు రాజకీయాల గురించి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ.. ప్రరాపా అధినేత చిరంజీవిపై బాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆయనకు పరిపాలన అంటే అసలు తెలియదన్నారు. సినిమా గ్లామర్‌తో ఓట్లు వేసేస్తారని ఆయన పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజారాజ్యం పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని, దాంతో వచ్చే ఎన్నికల్లో బయటపడిపోతామనుకొంటున్న కాంగ్రెస్ నాయకుల ఆశలు కల్లలు కాక తప్పదని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు విజ్ఞులని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని, కాంగ్రెస్‌ను ఓడించి తెదేపాకు పట్టం కడతారని ధీమా వ్యక్తంచేశారు. ''సీపీఎం, సీపీఐ, తెదేపా కలుస్తున్నాయి. తెరాస కూడా రేపో మాపో మాతో కలుస్తుంది'' అని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications