భూవివాదంలో అల్లు అరవింద్‌పై కేసు

Allu Aravind
హైదరాబాద్: ఒకరి కంటే ఎక్కువ మంది ఇతరుల స్థలంలోకి ప్రవేశించడం, నష్టం కలిగించడం వంటి అభియోగాలపై ఐపీసీ సెక్షన్‌ 447, 427, 34 కింద అల్లు అరవింద్‌, అతడి కుటుంబ సభ్యులపై నార్శింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. హైదరాబాద్‌ శివారులోని నార్సింగి గ్రామ పరిధిలో 163, 164,165, 131 సర్వే నెంబర్లలోని భూమికి సంబంధించి అల్లు అరవింద్‌ కుటుంబానికి, ముసారంబాగ్‌కు చెందిన న్యాయవాది రాహుల్‌దేవ్‌, అతడి సోదరుడు అద్రేష్‌దేవ్‌ల మధ్య వివాదం నెలకొంది. న్యాయవాది సోదరులపై ఈనెల 13న అరవింద్‌ కుటుంబానికి చెందిన కె వసంతలక్ష్మి ఫిర్యాదు చేశారు.

తమ భూమిని ఆక్రమిస్తున్నారన్న ఆమె ఫిర్యాదుపై ఆ రోజే పోలీసులు కేసు నమోదు చేశారు. అదేరోజు అల్లు అరవింద్‌, వారి కుటుంబ సభ్యులు తమను బెదిరిస్తున్నట్లు రాహుల్‌దేవ్‌ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాని కేసు నమోదు కాలేదు. మరుసటిరోజు రాహుల్‌ సైబరాబాద్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు నమేదు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+