సింహరాశి, కన్యారాశి ఆగస్టు నెల జాతకం పూర్తి వివరాలు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలు ఏర్పడుతుంటాయి. కొన్ని రాశులకు కలిసివస్తుంది. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇంకొన్ని రాశులవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖగోళంలో గ్రహాల కలయికతో ఈ పరిణామాలు ఏర్పడుతుంటాయి. అలాగే ఆగస్టు నెలకు సంబంధించి సింహరాశి, కన్యా రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఆగస్టు నెలలో సింహ రాశి వారికి రవి సంచారం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. ఉద్యోగస్తులకు పనిలో గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మద్దతు ఉంటుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది, కానీ ప్రయాణాలు లేదా కుటుంబ అవసరాల కోసం ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసర వ్యయాలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. చిన్నపాటి మాటపట్టింపులు వచ్చినా సర్దుమణుగుతాయి. ఉత్సాహంగా ఉంటారు. అయితే ఎండ తీవ్రత లేదా వేడి వల్ల వచ్చే చిన్నపాటి సమస్యలు పట్ల జాగ్రత్త వహించాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం శుభఫలితాలనిస్తుంది.

కన్యా రాశి (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)
కన్యా రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అను అనుకోని విజయం సాధిస్తారు. వృత్తిపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సహోద్యోగులతో అనవసర వాదనలకు దిగకపోవడం మంచిది. వ్యాపారులకు పాత బకాయిలు వసూలవుతాయి. ధన యోగం ఉన్నప్పటికీ, ఊహించని ఖర్చులు ముందుకు రావచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. బంధువులతో లేదా మిత్రులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ఒత్తిడి పెరగకుండా యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ఆహార విషయంలో నిగ్రహం పాటించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా బుధవారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మేలు చేస్తుంది.












Click it and Unblock the Notifications