స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య నిర్ణయం- కొత్త లెక్కలు, 'డైరెక్ట్' వార్..!?

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి వర్సస్ వైసీపీ మధ్య రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతోంది. మూడు పార్టీల సమన్వయం పైన ముఖ్య నేతలు ఫోకస్ చేసారు. సీట్ల పంపకాల పైన అధినేతలు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని సీఎం చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొస్తోంది. దీంతో.. ఇప్పుడు ఈ నిర్ణయం పార్టీలకు కీలకంగా మారనుంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నిక లు నిర్వహించాలని భావిస్తోంది. ఇందు కోసం పార్టీ నేతలకు ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సీఎం చంద్రబాబు.. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపల్ సంస్థ లకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ సమయంలోనే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల తో పాటుగా మున్సిపల్ చైర్మన్లు..మేయర్ల కు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికల దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు అభిప్రాయ సేకరణ జరుగుతోంది. దీని ద్వారా వీరిని కూడా నేరుగా ఎన్నుకోవటంతో... ఫలితాల తరువాత ఎలాంటి వివాదాలు.. క్యాంపు రాజకీయాలకు అవకాశం ఉండదని భావిస్తున్నారు.

ap-govt-seeks-opinion-on-direct-elections-for-mayors-chairpersons-ahead-of-municipal-polls

ప్రత్యక్ష పద్దతిలో ఎన్నికల దిశగా

జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల వ్యవస్థను యథావిధిగా కొనసాగిస్తూనే జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌లు, మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులతో పాటు, నగరపాలక సంస్థల మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీని పైన అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమైంది. ప్రస్తుతం అమలు చేస్తున్న పరోక్ష పద్ధతి వల్ల తీవ్రస్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. స్థానిక ప్రజలు ఒక పార్టీకి లేదా అభ్యర్థికి స్పష్టమైన మద్దతు ఇచ్చినా, ఫలితాలు వెలువడిన తర్వాత కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలతో క్యాంపులు ఏర్పాటు చేసి.. పదవి సొంత చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో.. ముఖ్యుల అభిప్రాయలు తెలుసుకున్న తరువాత ప్రభుత్వం ఈ తరహా ఎన్నిక పైన నిర్ణయం ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+