తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్ లోని లక్డీ కా పూల్ లో ఉన్న తెలంగాణా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఊహించని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ విధులలో ఉన్న స్వామి అనే పోలీస్ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఆత్మహత్య ఘటన

మొన్నటికి మొన్న త్రిపుర డిజిపి అనురాగ్ ధన్కర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరచిపోకముందే తెలంగాణ డీజీపీ కార్యాలయంలో మరొక ఆత్మహత్య ఘటన చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. ఈ ఘటన వివరాలలోకి వెళితే తెలంగాణా డీజీపీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న స్వామి అనే కానిస్టేబుల్ నిన్న రాత్రి విధులు నిర్వర్తించారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వాష్ రూమ్ కి వెళ్ళాడు.

constable suicide in dgp office duty constable shoot with is service revolver with family problems

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్

స్వామి తనతో తీసుకు వెళ్లిన సర్వీస్ రివాల్వర్ తో తనను తానే కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శబ్దం విని వెంటనే స్పందించిన తోటి సిబ్బంది వాష్‌రూమ్‌కి వెళ్లేసరికి స్వామి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం స్వామి కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాలతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.

డైరీలో సూసైడ్ నోట్

పోలీసుల తనిఖీలలో స్వామికి సంబంధించిన డైరీ స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆయన రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖలో స్వామి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా భార్య, పిల్లల్ని ఏమి అనొద్దు. వాళ్ళు చాలా మంచివాళ్ళు.. నేను చనిపోయిన తర్వాత దెయ్యం అయినా సరే వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ లేఖ రాశారు. ఆ లేఖను సైతం స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెరుగుతున్న ఆత్మహత్యలతో ఆందోళన

చిన్న చిన్న కారణాలకే, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం మానేసి, తీవ్ర మానసిక ఆందోళనకు గురై క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నవారు కుటుంబాలను అనాధలుగా చేసి వెళుతున్నారు. ఈ పరిస్థితి మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+