పవన్ నీతులు చెప్పకు:జీవిత

అయినా ఇప్పుడు కొత్తగా తెలుగు భాషపై పవన్‌కు అంత ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందో నాకు తెలియటంలేదని అన్నారు.తను నటించిన ప్రతి సినిమాలో వెస్ట్రన్ కల్చర్‌ను చూపించే ఆయన తెలుగుపై ఇంత ప్రేమను పెంచుకోవటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఎద్దేవా చేశారు. తాళికట్టిన తెలుగు అమ్మాయిని వదిలేసి మరాఠీ అమ్మాయితో సహజీవనం చేస్తున్న పవన్‌కు తెలుగు సంస్కృతి గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. పనిలో పనిగా చిరంజీవి బ్లడ్ బ్యాంకుపై కూడా ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇతరుల రక్తంతో వ్యాపారం చేస్తూ తామెంతో సేవ చేస్తున్నారని విర్రవీగుతున్నారని ఆరోపించారు. పవన్ మాటలు చిన్న పిల్లల మాటల వలె ఉన్నాయని ఆయన కట్టడి చేయాల్సిన చిరంజీవే ప్రోత్సహిస్తున్నాడని అన్నారు.












Click it and Unblock the Notifications