హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆర్టీసి మాజీ ఎండి. గోనె ప్రకాశరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాచార హక్కు చట్టాన్ని సంధించి చిరంజీవి ఆస్తుల చిట్టా బయట పెడతానని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. సినిమాల్లో నటించి చిరంజీవి సంపాదించిన దానికంటే అధికమొత్తంలో ఇన్‌కంట్యాక్స్ చెల్లించడంలోని లొసుగు ఏమిటో బహిర్గతం చేస్తానని ఆయన ప్రకటించారు.అయినా అసలు వారికి రాజకీయాలు ఏం తెలుసని ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చిరంజీవి చిత్రాల్లో చేరేనాటికి ఉన్న ఆస్ధికి, ఇప్పటికి గల తేడా వివరిస్తూ సంబంధిత లెక్కలను కూపీ లాగుతానన్నారు.