లండన్: ముంబై ప్రేలుళ్ళ వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ప్రముఖ రచయిత సాల్మన్‌రష్దీ ఆరోపించారు. అటు తీవ్రవాదులకు సహకరిస్తూనే ఇటు తీవ్రవాదంపై పోరాడుతున్నట్లు నటిస్తున్న పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని విడనాడేలా బుద్ధి చెప్పాలని రష్దీ బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాక్ గడ్డపై తీవ్రవాద కార్యకలాపాలు జరిగినంతకాలం పశ్చిమదేశాలు అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తామంటూ బ్రిటన్ పాక్‌ను హెచ్చరించాలని ఆయన సూచించారు.