రాష్ట్రపతి విశాఖ పర్యటన నేడే

నావికాదళాధిపతి అడ్మిరల్ సురేష్ మెహతా, తూర్పు నావికాదళం ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ నిర్మల్ వర్మ, తదితర నావికా దళ ప్రతినిధులు ఐఎన్‌ఎస్ డేగ వద్ద ఆమెకు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తూర్పు నావికా దళం (ఈఎన్‌సి) అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఐఎన్‌ఎస్ డేగా శత్రు దుర్భేద్యంగా మారింది. రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతాధికారులతో చర్చించిన ఈఎన్‌సి అధికారులు, నగర పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.












Click it and Unblock the Notifications