హైదరాబాద్ :కాంగ్రెస్, తెదేపా నేతలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి జయప్రద విమర్శించారు. రాష్ట్రాన్ని 60 ఏళ్లుగా పరిపాలిస్తున్న రాజకీయ పార్టీలు బడుగు బలహీనవర్గాల ప్రజలను దగా చేశాయని ఆమె పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో పార్టీని బలోపేతం చేయాలని జాతీయ నాయకత్వం నిర్ణయించిన నేపథ్యంలో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే తనకు రాష్ట్ర బాధ్యతలను అప్పగించారని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీచేయనున్నారని ఆమె తెలిపారు.