వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు పర్యటనపై పోలీస్ కన్ను

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
నెల్లూరు :నెల్లూరు జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రారంభించిన ప్రజా అంకిత సభలు మూడో రోజుకు చేరుకున్నాయి. రోడ్ షో లపై నిబంధనలు ఉండటంతో ఎక్కడైనా చిరంజీవి వాటిని అతిక్రమిస్తే కేసులు పెట్టటానికి రంగం సిధ్ధం చేసారు. ఇందులో భాగంగా చిరంజీవికి భద్రత కల్పించటం కన్నా ఆయన కదలికలపైనే పోలీసులు ఎక్కువ దృష్టి పెట్టారు. ఇప్పటికే నాయుడు పేట,గూడూరు,వెంకటగిరి సభల్లో ఆయన నిబంధనలు అతిక్రమించారని కేసులు నమోదు చేయటానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ విషయాన్ని నిన్న నెల్లూరు పర్యటనలో ఓ పోలీసు అధికారి నేరుగా వెళ్ళి చిరంజీవిక వివరించారు. కోర్టులు,చట్టం,నిబంధనలు పిరిధిలో తాము వ్యవహించక తప్పదని ఆ అధికారి చెప్పినట్లు సమాచారం.

మంగళవారం కొవూరు, ఆత్మకూరు, నింజమూరు, కావలిలో చిరంజీవి ప్రజా అంకిత సభలు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల పీఆర్పీ నాయకులు చిరు సభలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ రోజు కావలిలో సభానంతరం కడనూతలోన్ని ఆర్‌.ఎస్‌.ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో రాత్రికి చిరంజీవి బస చేస్తారు. బుధవారం ఇంజనీరింగ్‌ కళాశాల సముదాయాన్ని చిరంజీవి ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని స్థానిక పీఆర్పీ నేతలు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే వివిధ గ్రామాల్లో చిరంజీవిని చూసేందుకు రోడ్లు పైకి వస్తున్న జనాన్ని చూసి,ఆయన కేవలం మూగ సైగలతోనే సరిపెడుతున్నారు. అయినప్పటికీ కాన్వాయ్ లో ఎక్కువ కార్లు ఉన్నందున కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. చిరవకు మీడియా వాహనాలు కూడా కాన్వాయ్ లో లెక్క చూపించి ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నారు.

రెండు రోజుల పర్యటనలో ఒక సభ నుండి రెండో సభకు వెళ్ళే దారిలో బారులు తీరిన ప్రజలను పలకరించటాన్ని కూడా పోలీసులు తప్పు పడుతున్నారు. ఇప్పటివరకూ దాదాపు ముఫ్పై చోట్ల ఈ తరహా తప్పిదాలు జరిగాయని పోలీసులు లెక్కించారని తెలుస్తోంది. మరో రెండు రోజుల పర్యటనలో మరికొన్ని అంశాలు చేర్చి కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X