హైదరాబాద్:పీఆర్పీకి తెలంగాణ విషయంలో స్పష్టత లేదని తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతి తెలిపారు.ఆ పార్టీ చెబితే ప్రజలెవరు నమ్ముతారని ప్రశ్నించారు.అలాగే తెలంగాణ విషయంలో టీడీపీకి చాలా స్పష్టత ఉందని ఆ కూటమితో వెళ్తేనే తెలంగాణ శక్తులకు లాభమన్నారు. తాము ఏ పార్టీతో పొత్తులు లేదా విలీనం అన్న విషయం సంక్రాంతి తర్వాత తేలుస్తానని చెప్పారు. తాను ఎక్కడి నుంచి పోటీచేయాలన్న దాన్ని ప్రజలే నిర్ణయిస్తారన్నారు.ప్రస్తుతం ఆమె టీఆర్‌ఎస్‌లో విలీనం దిశగా పావులు కదుపుతున్నారు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఈ ప్రయత్నాలు చేసిన ఆమె సీట్ల విషయంలో కేసీఆర్ నుంచి ఆశించిన రీతిలో స్పందన రాకపోవడంతో ప్రస్తుతానికి ఆ విషయాన్ని ప్రక్కన పెట్టారు.