తగ్గనున్న పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: మరోసారి పెట్రో ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు త్వరలోనే పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3, ఎల్‌పిజి వంటగ్యాస్‌పై రూ.25 తగ్గించే అవకాశముందని శనివారం పెట్రోలియం శాఖ మంత్రి మురళీదేవరా వెల్లడించారు. దీనితో లారీ యజమానులు ఒక మెట్టు దిగివచ్చి సమ్మె విరమించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే చమురు సంస్థల ఉద్యోగులు సమ్మె విరమించడంతో సంక్షోభ తీవ్రత కొంత సద్దు మణిగింది. అయితే సమ్మెకు దిగిన వివిధ యాజమాన్య సంఘాలను సంతృప్తి పరచడం కోసం కేంద్రం ఈ సత్వర ప్రకటన చేసి ఉండవచ్చనే విమర్శలు చెలరేగుతున్నాయి. ఎటూ ఎన్నికల వేళ ఈ నిర్ణయం కాంగ్రెస్‌కు లాభమేనని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications