నేడే రాజు కోర్టులో హాజరు
హైదరాబాద్: రామలింగరాజు, రామరాజులను శనివారం ఉదయం కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐడీ ఐజీ కౌముది తెలిపారు. బోర్డు డైరెక్టర్లకు రామలింగరాజు రాసిన ఉత్తరం ఆధారంగా తాము కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసులో వారిని పిలిపించి విచారించిన అనంతరం అరెస్టు చేశామని వెల్లడించారు. సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్ పాత్రపైనా దర్యాప్తు సాగిస్తున్నామని, అవసరమైన వివరాలు లభించిన తర్వాత ఆయనను కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. బోర్డు డైరెక్టర్లనూ అరెస్టు చేసే అవకాశముందని వివరించారు.












Click it and Unblock the Notifications