హైదరాబాద్: నిన్న రాత్రి డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన సత్యం కంప్యూటర్స్ మాజీ ఛైర్మన్ రామలింగరాజుకు ఛాతిలో నొప్పివచ్చిందని పోలీసువర్గాలు తెలిపాయి. దాంతో డీజీపీ కార్యాలయానికి డాక్టర్స్ ను పిలిపించి చికిత్స చేయిస్తున్నట్లు వారు చెప్పుతున్నారు. ఎక్కువ ఒత్తిడికి గుండె గురి అవటం వల్ల ఆ నొప్పి వచ్చిందని డాక్టర్స్ భావిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సీఐడీ కస్టడీలో ఉన్నారు. రామలింగరాజుపై 120బి, 406, 409, 417, 420, 468 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.