రూపాయికే కిలో బియ్యం:కేసీఆర్

దేశంలోని దాదాపు అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలమని ప్రకటించాయన్నారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ తెలంగాణకు సై అనకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. జై తెలంగాణకు అనకపోతే ఓట్లు కాదు.. పోట్లు పడతాయని పేర్కొన్నారు.సమైక్య రాష్ట్రంలో ఉండడంతో తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని, గిరిజనులు రిజర్వేషన్లను సైతం కోల్పోతున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏర్పడితే గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా రాజ్యాధికారంలో కూడా వాటా దక్కుతుందన్నారు.












Click it and Unblock the Notifications