48 గంటల్లో సత్యంపై యాక్షన్‌ప్లాన్ :దీపక్ పరేఖ్

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సంస్థపై విశ్వాసం కలిగించేలా చర్యలు తీసుకోవడం, ఉద్యోగులకు భరోసా ఇవ్వడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యాలని దీపక్ పరేఖ్ వివరించారు. సత్యం సంస్థలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లుగా కనిపించడం లేదని, కొంత ప్రయత్నిస్తే సమస్యను చక్కదిద్దవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
సత్యం పరిస్థితి చక్కబడే వరకూ నిరంతర సమీక్షలు ఉంటాయని, ద్రవ్య లభ్యత, సరఫరాపై ఒక పారదర్శక విధానాన్ని పాటిస్తామని ఆయన వివరించారు. సత్యం సంస్థను గాడిలో పెడతామని స్పష్టం చేశారు.అదేవిధంగా త్వరలోనే పూర్తిస్థాయి బోర్డు నియామ కం ఉంటుందని, ఇక బోర్డు నిరంతర సమావేశాలు ఉంటాయని చెప్పారు.
మరో ప్రక్క సత్యం కంప్యూటర్స్‌ను నిలబెట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కేంద్ర సర్కారు స్పష్టం చేసింది. సత్యం కంప్యూటర్స్‌కు ఆర్థిక సహాయం కూడా చేస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి కమల్‌నాథ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications