రాజు ప్రాణాలకు ముప్పు:నన్నపనేని

రామలింగరాజు పరిస్థితి చూస్తుంటే.. జాలి, బాధ కలుగుతున్నాయన్నారు. మన రాష్ట్రానికి చెందిన క్షత్రియులకు ద్రోహబుద్ధి లేదని ప్రజల కోసం వారు రాజ్యాలు, ఆస్తులు కోల్పోయారని గుర్తుచేశారు. రామలింగరాజు కూడా ఇదే కోవకు చెందుతారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యులు అనేక సందర్భాల్లో రాజుపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. 'సత్యం' సొంతంగా 108ను ప్రవేశపెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం హైజాక్ చేసి రాజీవ్ బొమ్మలు తగిలించిందని దుయ్యబట్టారు.అలాగే పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శీనును చంపించిన విధంగానే రామలింగరాజును కూడా చేస్తారన్న అనుమానం తనకుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications