ప్రధానిగా మోడీ:మిట్టల్,అనిల్ అంబానీ

ముకేష్ అంబానీ, రతన్ టాటా,కుమార మంగళం బిర్లా,కె.వి.కామత్ తో సహా నలభై దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. కార్పోరేట్ దిగ్గజాల వ్యాఖ్యలతో కలవర పడ్డ బీ.జె.ఫీ పార్టీ వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఓ ప్రక్క భైరాన్ సింగ్ షెకావత్ నిరసన గొడవ మర్చిపోకముందే మోడి పేరు తెరపైకి రావడం పార్టీలో అయోమయ స్ధితికి చేరినట్లయింది. దాంతో వెంటనే తమ పార్టీ ప్రధాని అభ్యర్ధి అద్వానీయే అని మరో సారి ప్రకటన చేసారు.అలాగే మోడిపై ఈ దిగ్గజాలు చేసిన వ్యాఖ్యలు ఆయన పనితనాన్ని చూసి ప్రశంసించమే గానీ అంతకు మించి మరేమి కాదని అంటోంది పార్టీ నాయకత్వం.












Click it and Unblock the Notifications