మహాకూటమిపై మండిపడిన చిరు

గత ఎన్నికల్లో టిడిపితో జట్టుకట్టిన వామపక్షాలు బాబు రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్‌కు తాకట్టు పె ట్టారని, రాష్ట్రాన్ని ప్రయోగశాల చేశారని చెప్పి ఇప్పుడు ఆ బాబుతోనే కలవడానికి గల కారణాలు ఏమిటని చిరంజీవి ప్రశ్నించారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటనపై ఉద్యమాలు నడిపిన వామపక్ష నేతలు ఇప్పుడు ఇలా బాబును సమర్థించడాన్ని ఆక్షేపించారు.
అదేవిధంగా తెలంగాణ ద్రోహుల పార్టీ అంటూ టిడిపికి కొత్త అబ్రివేషన్ చెప్పిన టిఆర్‌ఎస్ ఇ ప్పుడు ఈ విధంగా వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. విలువలు లేని రాజకీయాలను తాము కోరుకోవడం లేదని, పూటకో మాట మార్చే నేతల వైఖరికి ప్రజలే ఓటు తో తీర్పు చెప్పి కళ్ళు తెరిపిస్తారని చిరంజీవి విలేఖర్ల సమావేశంలో అన్నారు.












Click it and Unblock the Notifications