పబ్లిసిటీకి ఇంత ఖర్చా? చిరు

ప్రచారం కోసం కో ట్ల రూపాయల ప్రజాధనా న్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. పీఆర్పీ అధికారంలోకి వస్తే చేతివృత్తిదార్లకు సగం ధర కే విద్యుత్ పథకాన్ని ప్రకటించిన సందర్భంగా అభినందనలు తెలిపేందుకు పలు చేతి వృత్తిదార్ల సం ఘాల నేతలు గురువారం పార్టీ కార్యాలయంలో చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.
బడుగు, బలహీన వర్గాలతో పాటు చేతి వృత్తిదార్ల జీవితాల్లో వెలుగులు తీసుకు వస్తామని భరోసా ఇచ్చారు. 'ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పత్రికా ప్రకటనలకే పరిమితమైంది. 80 లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రకటించిన సర్కారు ఇప్పటి వరకు ఎన్ని కట్టించి ఇచ్చిందో లెక్క చెప్పాలి. ఈ విషయంలో సంబంధిత మంత్రి, అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతనే కుదరడం లేదు.












Click it and Unblock the Notifications