రాజు బెయిల్ పై 19న మళ్ళీ విచారణ

Ramalinga Raju
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు బెయిల్ పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. రామలింగరాజును తమ కస్టడీకి అప్పగించాలని సిఐడి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ మీద వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు. రామలింగరాజును గత శనివారం అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా, ఆయనను చంచల్ గుడా జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రామలింగరాజు పెట్టుకున్న పిటిషన్ మీద ఈనెల 19న విచారణ జరుగనుంది. రామలింగరాజును విచారించడానికి వీలుగా తమకు అప్పగించాలంటూ సెబి దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఈనెల 19న నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతుంది. సత్యం నిధులను, భూములను రామలింగరాజు తన కుమారుడి కంపెనీ అయిన మేటాస్ కు అప్పగించినట్టు అరోపణలు ఉన్నాయి. అనేక కోణాల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రామలింగరాజుకు బెయిల్ లభించే విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+