హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ మాజీ ఛైర్మన్ సత్యం రామలింగరాజు బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు శుక్రవారం విచారణ నిర్వహిస్తుంది. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, మాజీ సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వాలని వారి తరపున న్యాయవాది కోర్టులో కొన్ని రోజుల క్రితం పిటిషన్ వేశారు. వీటిపై విచారణను శుక్రవారానికి అంటే నేటికి వాయిదా వేసింది. ఈ రోజు బెయిల్ పిటిషన్లతో పాటు, సెబీ, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయవాది విచారణ జరుపుతారు. మరోవైపు రామరాజును సీఐడీ పోలీసు కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెయిల్ పై వాదోపవాదాలు ముగిసేసరికి సాయంత్రం వరకు సమయం పట్టవచ్చు.