మహా కూటమికి భయపడం:చిరు పార్టీ
హైదరాబాద్: తెలుగుదేశం నాయకత్వంలోని మహాకూటమికి తాము భయపడడం లేదని, ఎవరెన్ని కూటములు పెట్టుకున్నా విజయం ప్రజారాజ్యం పార్టీదేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా అభిప్రాయపడ్డారు. కేవలం అధికారం కోసమే కూటములు ఏర్పడుతున్నాయి కానీ ప్రజా శ్రేయస్సు కోసం కాదని, ఈ కలయికలు సిద్ధాంతం ప్రాతిపదికగా జరగడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణపై చిరంజీవి స్పష్టమైన వైఖరి ఉండని మిత్రా చెప్పారు. ఒక ప్రైవేటు టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా విశ్వాసంతో కన్పించారు. ఎన్నికల తర్వాత ఎవరికైనా మద్దతు ఇస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా "అధికారంలోకి వచ్చే ప్రజారాజ్యమే. కాబట్టి మేం ఎవరికీ మద్దతు ఇచ్చే ప్రశ్న ఉత్పన్నం కాదు" అని చెప్పారు.












Click it and Unblock the Notifications